Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్స్ వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాతో భారత్ ఢీ... గెలిస్తే అద్భుతమే...

మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే.. ఇప్పటివరకు 10సార్లు వరల్డ్‌కప్ జరిగితే ఆస్ట్రేలియా ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచ

Webdunia
గురువారం, 20 జులై 2017 (10:46 IST)
మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే.. ఇప్పటివరకు 10సార్లు వరల్డ్‌కప్ జరిగితే ఆస్ట్రేలియా ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. అలాగే, భారత్‌తో ఇప్పటివరకు ఆడిన 42 మ్యాచుల్లో 34సార్లు ఆస్ట్రేలియా జట్టు నెగ్గింది. 2013 వరల్డ్‌కప్ తర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3సార్లు విజయం సాధించి సరికొత్త చరిత్రను కంగారులు నెలకొల్పారు. అందుకే ఈమ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. 
 
మరోవైపు భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగి సెమీస్ లక్ష్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన భారత మహిళల జట్టు.. వరల్డ్‌కప్‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఫైనల్ బెర్త్ కోసం గురువారం జరిగే సెమీస్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. 
 
కివీస్‌ను ఓడించి సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవడంతో భారత్ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే ఫామ్‌ను కంగారూలపై కూడా చూపెట్టాలని మిథాలీసేన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. సెమీస్‌కు ఆతిథ్యమిస్తున్న గ్రౌండ్‌లో ఆసీస్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. భారత్ ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడి ఉండటం అదనపు ప్రయోజనం. జట్టు పరంగా అందరూ అంచనాలను అందుకుంటుండటం లాభించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
ఇంకోవైపు లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా సూపర్ ఫామ్‌లో ఉంది. తుది జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది. టాప్ ఆర్డర్‌లో మూనీ, లానింగ్, పెర్రీ, బోల్టన్.. వీళ్లలో ఒక్కరు కుదురుకున్నా భారత్‌కు కష్టాలు తప్పవు. భారీ లక్ష్యాలను ఛేదించడంలో ఆసీస్‌ది అందెవేసిన చేయిగా ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

తర్వాతి కథనం
Show comments