Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోప్ పరీక్షలో పట్టుబడిన భారతీయ అథ్లెట్ ... స్వర్ణం వెనుకకు?

భారత మహిళా షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. దీంతో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆమె సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకోనున్నారు.

Webdunia
గురువారం, 20 జులై 2017 (10:14 IST)
భారత మహిళా షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. దీంతో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆమె సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకోనున్నారు. 
 
ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ సందర్భంగా గతనెల 1నుంచి 4వ తేదీ వరకు పాటియాలాలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించారు. ఈ పరీక్షల్లో మన్‌ప్రీత్ డోపీగా తేలింది. నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు మన్‌ప్రీత్ యూరిన్ ఎ శాంపిల్స్‌లో రుజువైందని జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధికారి వెల్లడించారు. బి శాంపిల్స్ పరీక్షలోనూ ఫలితం పాజిటివ్‌గా వెల్లడైతే మన్‌ప్రీత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకుంటారని చెప్పారు.
 
ప్రస్తుతానికి మన్‌ప్రీత్‌పై తాత్కాలిక నిషేధం విధించకపోయినా, బి శాంపిల్స్ పరీక్ష ఫలితాన్ని బట్టి ఆమెపై వేటు పడే అవకాశముంది. ఓ అథ్లెట్ డైమిథైల్‌బుటిలమైన్ డ్రగ్ వాడినట్లు తేలడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలకు ముందు క్రీడాకారులు ఎక్కువగా ఈ డ్రగ్‌ను తీసుకునేవారని అథ్లెటిక్స్ వర్గాలు చెబుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments