Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు అదుర్స్.. బంగ్లాపై 110 పరుగుల తేడాతో గెలుపు

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (23:13 IST)
భారత మహిళా క్రికెట్ జట్టు మహిళల ప్రపంచకప్‌లో అదరగొట్టింది. భారత జట్టు తన ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టును మట్టి కరిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించి బంగ్లాదేశ్ పై 110 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
టాస్ గెలిచిన భారత మహిళల జట్టు ముందు బ్యాటింగ్ తీసుకుంది. యస్తిక భాటియా మరోసారి రాణించి 50 పరుగులు సాధించగా.. ఓపెనర్లు స్మృతి మందన 30, షఫాలి వర్మ 42 పరుగులు రాబట్టారు. 
 
వీరికి పూజ వస్త్రాకర్, స్నేహ్ రాణా మద్దతుగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 229 పరుగులు సాధించింది. రితుమోని కూడా రాణించి మూడు వికెట్లు తీసింది. నహీదా అక్తర్ 2 వికెట్లు తీసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా యస్తిక భాటియా ఎంపికైంది.
 
అనంతరం 230 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు కట్టి పడేశారు. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ వెన్ను విరిచేలా స్నేహ్ రాణా బౌలింగ్ తో విరుచుకుపడింది. పూజ వస్త్రాకర్, జులాన్ గోస్వామి సైతం 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. దీంతో 40.3 ఓవర్లకే 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

తర్వాతి కథనం
Show comments