Webdunia - Bharat's app for daily news and videos

Install App

WTC 2021: రెండేళ్ల నిరీక్షణకు వరుణ దేవుడు గండి..

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (11:58 IST)
Rain
క్రికెట్ ప్రేమికుల రెండేళ్ల నిరీక్షణకు వరుణ దేవుడు గండి కొట్టినట్టే కనిపిస్తోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న సౌథాంప్టన్‌లో వచ్చే వారం రోజులూ వర్షం పడే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. సౌథాంప్టన్‌లో వచ్చే ఆరు రోజులూ వర్షాలు పడొచ్చంటూ బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
 
ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. సౌథాంప్టన్ మొత్తంగా ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే వారం రోజులూ ఇదే తరహా వాతావరణం సౌథాంప్టన్‌లో ఉండటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం- 16 డిగ్రీల ఉష్ణోగ్రతతో వర్షం కురుస్తోన్నట్లు తెలిపింది.
 
సౌథాంప్టన్‌లో ప్రస్తుతం సుమారు అయిదు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు తెరపి ఇస్తోన్నప్పటికీ.. మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఏజెస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. బురదమయమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments