కీరన్ పొలార్డ్ వీర విహారం... ఒకే ఓవర్‌లో 6-6-6-6-6-6 (Video)

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (10:08 IST)
వెస్టిండిసీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సిక్సర్లతో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదు చేసిన ఘనత కీరన్ పొలార్డ్ సాధించాడు. 
 
ఈ నేథ్యంలో బుధవారం రాత్రి శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పొలార్డ్ ఈ ఘనత సాధించాడు. శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ వేసిన ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సిలు బాది అతడికి పీడకలను మిగిల్చాడు. 
 
పొలార్డ్ ధాటికి విండీస్ 131 పరుగుల లక్ష్యాన్ని 13.1ఓవర్లలోనే ఛేదించింది. సౌత్ ఆఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హర్షలీ గిబ్స్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదు చేసిన ఘనత కీరన్ పొలార్డ్ సాధించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. అనంతరం విండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 13.1 ఓవరల్లో లక్ష్యాన్ని ఛేదించింది. 
 
కాగా, గతంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన విషయం తెల్సిందే. ఇపుడు పొలార్డ్ ట్వంటీ-20 మ్యాచ్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments