నేపాల్, శ్రీలంక దేశాల్లో పార్టీని ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తున్నట్టు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ పేర్కొన్నారు. భారత్‌లోనే కాకుండా, నేపాల్, శ్రీలంకలో కూడా పార్టీని ఏర్పాటు చేస్తామని గతంలో అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీని ఏర్పాటు చేసి పట్టు సాధించిన తరువాత విదేశాల్లో కూడా పార్టీని ఏర్పాటు చేస్తామని గతంలో అమిత్ షా చెప్పినట్టు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ పేర్కొన్నారు.
కాగా.. దేశంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరవేసింది.
ఇప్పటికే ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. దేశంలో బలమైన శక్తిగా, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపీ చూపులు ఇప్పుడు పక్క దేశాలపై కూడా పడినట్టు సమాచారం.