Webdunia - Bharat's app for daily news and videos

Install App

#రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్- రిషబ్ పంత్‌పై కుళ్లు జోకులు (video)

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (11:41 IST)
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఫీల్డింగ్ చేశాడు. అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. బౌండరీలైన్ వద్ద రిలే క్యాచ్‌తో క్రికెట్ ఫ్యాన్సుకు షాకిచ్చాడు. ఈ షాట్‌ను కొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్.. రోహిత్ క్యాచ్‌ను చూసి షాకయ్యాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇదే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి నెటిజన్లు ఒక ఆటఆడుకుంటున్నారు. తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పనిచెబుతూ ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో పంత్ గాయపడటంతో అనూహ్యంగా వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకున్న రాహుల్ రఫ్ఫాడిస్తున్నాడు. అటు బ్యాటింగ్.. ఇటు కీపింగ్‌లో దూసుకుపోతున్నాడు.
 
ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ సైతం స్పెషలిస్ట్ కీపర్ అయిన పంత్‌ను పక్కనపెట్టి రాహుల్‌కే కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాడు. అతను కూడా కెప్టెన్ నమ్మకం కోల్పోకుండా అదరగొట్టాడు. దీంతో పంత్ అవసరం జట్టుకు లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తట్టా బుట్టా సర్థుకోమనే అర్థంతో మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా జోకులు పేల్చుతున్నారు. అతని నిలకడైన పెర్ఫామెన్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments