డేవిడ్ వార్నర్ మరో అరుదైన రికార్డు- వరల్డ్ కప్ తర్వాత వద్దే వద్దు

సెల్వి
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (18:19 IST)
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మరో అరుదైన రికార్డును సాధించాడు. క్రికెట్‌లోని మూడు మ్యాచుల్లోనూ 100కు పైగా మ్యాచులు ఆడిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మరోవైపు, వార్నర్ తన కెరీర్‌కు ముగింపు పలికేందుకు రెడీ అయ్యాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. 
 
కాగా ఇటీవలే వెస్టిండీస్‌తో వార్నర్ తన 100వ టీ20 మ్యాచ్‌ను ఆడాడు. తద్వారా ఆస్ట్రేలియా తరపున 100 టీ20 మ్యాచులు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచిన వార్నర్.. ఇప్పటివరకూ 112 టెస్టులు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. 
 
వెస్టిండీస్‌తో జరుగుతున్న టోర్నీలోనూ వార్నర్ దుమ్ములేపుతున్నాడు. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 37 ఏళ్ల వార్నర్ మెరుపు అర్ధసెంచరీతో (70, 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో వార్నర్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. పాకిస్థాన్ టెస్టులోనూ చెలరేగి ఆడాడు. 
 
క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 100, అంతకంటే ఎక్కువ మ్యాచులు ఆడిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ..113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments