నా బయోపిక్‌లో ఆయన నటిస్తేనే బాగుంటుంది.. వీవీఎస్ లక్ష్మణ్

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (17:12 IST)
క్రీడాకారుల బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ధోనీ సినిమా తెరకెక్కింది. తాజాగా హైదరాబాదీ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ తన బయోపిక్ గురించి నోరు విప్పారు. 
 
తాజాగా తన బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా వీవీఎస్ మాట్లాడుతూ.. 281 అండ్ బియాండ్ అనే పుస్తకాన్ని.. స్పోర్ట్స్ రైటర్ ఆర్.కౌశిక్ రాశారని తెలిపారు. గతంలో తన బయోపిక్ గురించి దర్శకులు సంప్రదించారని.. కానీ అప్పుడు పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు తన బయోగ్రఫీ మీద ఆసక్తి కలుగుతోందని.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లాంటి నటులు తన బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. 
 
తాను మహేష్ నటించిన అనేక సినిమాలు చూశానని.. అతను చాలా మంచి నటుడని కితాబిచ్చాడు. అలాంటి వ్యక్తి తన బయోపిక్‌లో తన పాత్ర పోషిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా వీవీఎస్ తన కెరీర్‌లో 127 టెస్టు మ్యాచ్‌లు, 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇంకా 20 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ ఆడాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు

నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కాకినాడలో ఉన్నతి ఫౌండేషన్ కొత్త వృత్తి శిక్షణా కేంద్రం ప్రారంభం

చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనీ యువకుడిని హత్య చేసిన అన్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

తర్వాతి కథనం
Show comments