Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ అత్యుత్సాహం.. వాకీ టాకీ వాడి చిక్కుల్లో పడ్డాడు.. ఐసీసీ క్లీన్ చిట్

వాకీ టాకీ వాడిన వ్యవహారంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోహ్లీకి క్లీన్ చిట్ ఇచ్చింది. మొబైల్ ఫోన్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకురాకూడదనే నిబంధన వుండటంతోనే కోహ్లీ వాకీ టాకీని ఉపయోగించాడని తేలింది

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (15:28 IST)
ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి ట్వంటీ20లో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను విరాట్ కోహ్లీ సేన చితక్కొట్టింది. ముఖ్యంగా, టీ-20ల్లో న్యూజిలాండ్‌పై ఖాతా తెరవాలన్న కసితో ఆడింది. అలాగే సుదీర్ఘ కెరీర్‌కు సొంతగడ్డపై వీడ్కోలు పలుకుతున్న ఆశీష్‌ నెహ్రాను విజయంతో సాగనంపాలన్న పట్టుదలతో కివీస్‌ను టీమిండియా మట్టికరిపించింది.
 
అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా అనవసరపు వివాదంలో చిక్కుకొన్నాడు. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ఆడుతూ వాకీటాకీ వాడినట్లుగా కోహ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.  
 
ఐసీసీ నియావళి ప్రకారం ఓ క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ వాకీటాకీ వాడటం నిషేధం. ఈ ఆరోపణలపై బీసీసీఐ సైలెంట్‌గా వున్నప్పటికీ వాకీ టాకీని ఉపయోగించిన కోహ్లీ కెమెరాలకు చిక్కడంతో అసలు సంగతి బయటికి వచ్చింది. ఢిల్లీ పేసర్ అశీష్ నెహ్రా వీడ్కోలు మ్యాచ్‌గా జరిగిన ఈ పోటీలో కొహ్లీ అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 
 
అయితే వాకీ టాకీ వాడిన వ్యవహారంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోహ్లీకి క్లీన్ చిట్ ఇచ్చింది. మొబైల్ ఫోన్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకురాకూడదనే నిబంధన వుండటంతోనే కోహ్లీ వాకీ టాకీని ఉపయోగించాడని తేలింది. సపోర్ట్ స్టాఫ్ డ్రెసింగ్ రూమ్ సభ్యులను కమ్యూనికేట్ చేసేందుకు వాకీ టాకీలను ఉపయోగిస్తుంటారు. 
 
మొబైల్ ఫోన్లు అనుమతి లేకపోవడంతో మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్ సభ్యులకు సమాచారాన్ని చేరవేసేందుకే కోహ్లీ వాకీ టాకీ ఉపయోగించాల్సి వచ్చిందని.. దీనిని ఉపయోగించేందుకు ముందే వెన్యూ ఏసీయూ మేనేజర్ అనుమతిని కూడా కోహ్లీ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఐసీసీ కోహ్లీకి క్లీన్ చిట్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments