Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని ఉపయోగించుకో కోహ్లీ.. అతనికి ప్రమోషన్ ఇవ్వు.. లేకుంటే నష్టమే: గంగూలీ

బెంగళూరులో బుధవారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలని భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అవసరమైతే జట్టులో కూడా కొన్ని మార్పులు చేయాలన్నాడు

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (13:53 IST)
బెంగళూరులో బుధవారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలని భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అవసరమైతే జట్టులో కూడా కొన్ని మార్పులు చేయాలన్నాడు. రైనాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం వల్ల చివర్లో భారీ షాట్స్ ఆడే ఆటగాడిని కోల్పోతున్నామని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పాండ్యా, ధోనీ ఉన్నా, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ ఉండటం కొంత మంచిదని తనకనిపిస్తుందని.. కాబట్టి అతని ఆర్డర్‌లో మనీష్ పాండేని పంపాలని గంగూలీ చెప్పుకొచ్చాడు. 
 
ఇక ధోనీకి తప్పకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇస్తేనే మంచి ఫలితాలను ఆశించవచ్చునని తెలిపాడు. ఎందుకంటే అతడు మునపటిలా కాదు. ఇప్పుడు చాలా స్వేచ్చగా ఆడుతున్నాడు. అలాంటి సమయంలో కోహ్లీ అతడిని సరిగా ఉపయోగించుకుంటే జట్టు భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో కూడా ధోని సలహా తీసుకుంటే మంచిదని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇంకా చెప్పాలంటే.. ధోనీని ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. భారత్ రెండో టీ-ట్వంటీలో గెలిచినా అది బౌలర్ల గొప్పదనమేనని, బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టుకు మంచిది కాదని గంగూలీ తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments