Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న మరణిస్తే.. ఇంటికెళ్లి పార్థివదేహాన్ని చూసి క్రికెట్ ఆడుతానని ఢిల్లీ కోచ్‌కు ఫోన్ చేశా: కోహ్లీ

Webdunia
శనివారం, 7 మే 2016 (15:49 IST)
తన క్రికెట్‌తో ఆటతో యావత్ భారతావనిని ఊపేస్తున్నఆటగాడు విరాట్ కోహ్లీ. సచిన్ తర్వాత గొప్ప బ్యాట్స్‌మెన్ ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు కూడా విరాట్ కోహ్లీదే. ఈ యువ క్రికెటర్ క్రీజ్‌లో ఉన్నాడంటే ఆ జట్టు గెలిచితీరాల్సిందే. ప్రస్తుతం అతనికి ఉన్న స్టార్‌డమ్ ప్రపంచంలో ఏ క్రికెటర్‌కూ లేదు. అయితే, క్రికెట్ జీవితంలోకి కోహ్లీ అంత సులభంగా అడుగుపెట్టలేదు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఎంతో కృషి చేస్తే ఆ స్థాయికి వచ్చాడు. అటువంటి కోహ్లీ తన గత స్మృతులను ఒకసారి గుర్తుచేసుకున్నాడు. 
 
విరాట్ కోహ్లీకి తన తండ్రి 'ప్రేమ్ కోహ్లీ' అంటే ఎంతో ఇష్టం. తన క్రికెట్ ఇలా వివరిస్తున్నాడు... '' నేను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తండ్రి గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో నేను ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాను. 40 పరుగులు చేశాను. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌గా తెల్లవారి క్రీజ్‌లోకి వెళ్లాల్సి ఉంది.' అని చెప్పారు. మా నాన్న మరణించడంతో ఇంటికి వెళ్లిన నేను ఢిల్లీ కోచ్కు ఫోన్ చేసి ఆడటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాను. 
 
ఎందుకంటే నేను నమ్ముకున్న క్రికెట్ గేమ్ను పూర్తి చేయకుండా ఉంటే అది ముమ్మాటికి నా తప్పేఅవుతుంది. దుఃఖాన్ని దిగమింగుకుని బ్యాట్ చేత పట్టుకుని క్రీజ్లోకి వెళ్లడానికి సిద్ధపడ్డా. ఆసమయంలో తీసుకున్న నిర్ణయం వల్ల నా క్రికెట్ జీవితం ఉన్నత స్థాయిలో ఉంది' అని కోహ్లీ తెలిపాడు. 
 
ఆ వెంటనే కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. కోహ్లీ తండ్రి మరణించినప్పుడు కోహ్లీ వయసు ''18''. అందుకే తన పద్దెనిమిదో యేట తండ్రి మరణించాడని గుర్తుగా కోహ్లీ ఎప్పుడూ ''18'' నంబర్ జర్సీనే ధరిస్తుంటాడు. ప్రస్తుతం క్రికెట్ కాకుండా యాడ్స్ రూపంలో అత్యధికంగా రూ.150 కోట్లకుపైగా సంపాదిస్తున్న తొలి క్రికెటర్ కోహ్లీ కావడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments