Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ గదను మూడోసారి నిలబెట్టుకున్న కోహ్లీ సేన (video)

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:28 IST)
టెస్ట్ క్రికెట్‌లో తమకు తిరుగులేదని భారత క్రికెట్ జట్టు మరోమారు నిరూపించింది. ఫలితంగా వరుసగా మూడో యేడాది కూడా ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. కోహ్లీ సేన 116 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ (108) రెండో స్థానం సాధించింది. ఆస్ట్రేలియా (104) నాలుగో స్థానానికి పరిమితమైంది. ప్రథమ స్థానంలో ఉన్న భారత్‌కు దాదాపు రూ.7 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు.. ఐసీసీ ఇచ్చే గదను కూడా దక్కించుకుంది. 
 
దీనిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, సుదీర్ఘ ఫార్మాట్‌లో టాప్‌లో నిలువడం చాలా చాలా గర్వంగా ఉంది. వరుసగా మూడో ఏడాది నంబర్‌ వన్ స్థానంలో నిలవడం మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నాడు. భారత్‌ జట్టు ఇప్పుడు బలంగా ఉందన్న కోహ్లీ... కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష వల్లే విజయాలు సాధ్యమయ్యాయన్నాడు. వచ్చే యేడాది కూడా టెస్టు ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. 
 
గత యేడాది కాలంలో కోహ్లీసేన.. అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టును, వెస్టిండీస్‌పై 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది. అలాగే ఇంగ్లండ్‌పై 1-4తో సిరీస్‌ ఓడినా.. ఆసీస్‌ పర్యటనలో 2-1తో టెస్టు సిరీస్‌ను చరిత్రాత్మక విజయంతో దక్కించుకుంది.  
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments