Webdunia - Bharat's app for daily news and videos

Install App

WTC ఫైనల్: చెమటోడుస్తున్న కోహ్లీ.. నెట్ ప్రాక్టీస్‌లో బిజీ

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (14:51 IST)
Net Practise
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఈ మహాసంగ్రామానికి తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ మెగా ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టి మెగా పోరు కోసం సన్నద్ధమవుతున్నాయి. న్యూజిలాండ్ అయితే ఆతిథ్య ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడి 1-0తో గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఉంది.
 
మరోవైపు భారత జట్టు మాత్రం ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. కేవలం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్, నెట్ సెషన్స్‌తోనే సమాయత్తం అవుతోంది. ఇది భారత్‌కు నష్టం చేస్తుందని మాజీ క్రికెట్లరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కీలక మ్యాచ్‌కు ముందు సిరీస్ విజయం ప్రత్యర్థికి అడ్వాంటేజ్ అయినప్పటికీ.. ఫైనల్ గెలిచే సత్తా భారత్‌కు ఉందని కూడా అంటున్నారు.
 
ఇక భారత ఆటగాళ్లు మాత్రం ఇవేం పట్టనట్లు ప్రాక్టీస్‌పైనే దృష్టిసారించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రూపొందించే పిచ్​ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందని ఏజెస్​ బౌల్​ క్యూరేటర్​ సైమన్​ లీ చెప్పడంతో కోహ్లీ ఆ దిశగా సమాయత్తం అవుతున్నాడు. న్యూజిలాండ్‌లో పొడగరి బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు బౌన్స్, షార్ట్ పిచ్ బంతులను ప్రాక్టీస్ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments