Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరుష్క బంధానికి ముచ్చటగా మూడేళ్లు!

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (13:54 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ గత 2017 డిసెంబరు నెల 11వ తేదీన ఓ ఇంటివారయ్యారు. ఇటలీలో వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగింది. అపుడు ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిది. ఈ క్రమంలో వీరు - అనుష్క పెళ్లి బంధానికి నేటితో మూడేళ్లు ముగియనున్నాయి. ఈ జంట ఇపుడు మూడో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 
 
ఈ సందర్భంగా ఈ సెలబ్రిటీ కపుల్‌కి సోషల్‌ మీడియాలో అభినందనల వెల్లువకురుస్తోంది. ముఖ్యంగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందబోతున్న తరుణంలో ఈ ఏడాది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు క్రికెట్‌ అభిమానులు, ఇటు బాలీవుడ్‌ ఫ్యాన్స్‌ విరుష్క  జంటకు  శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు. దీంతో ట్విట​ర్‌లో ట్రెండింగ్‌గా విరుష్కాల పెళ్లిరోజు మారడం విశేషం.
 
కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే, వన్డే, ట్వంటీ20 సిరీస్‌లను పూర్తి చేసుకున్న కోహ్లీ సేన త్వరలో టెస్ట్ సిరీస్‌ను ప్రారంభించనుంది. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి రానున్నాడు. తన భార్య కాన్పు సమయంలో దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ బీసీసీఐ అనుమతితో స్వదేశానికి తిరిగిరానున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి భగభగలు.. 202 మండలాల్లో నేడు తీవ్రమైన వేడిగాలులు.. అలెర్ట్

మా ఇంట్లో దొంగ గంటన్నరపాటు హల్చల్ చేశాడు : ఎంపీ డీకే అరుణ (Video)

వివేకా హత్య కేసు : అప్రూవర్ దస్తగిరి భార్యపై వైకాపా కార్యకర్తల దాడి

కుక్కల కోసం ఇంటిని అమ్మేసిన యువకుడు

జనం కోసం పుట్టిన పార్టీ ఇపుడు ఆంధ్ర మత సేనగా మారిపోయింది : షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

తర్వాతి కథనం
Show comments