Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నెం.1: విరాట్ ఖాతాలో రూ. 100 కోట్ల డీల్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆట‌గాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం ర్యాకింగ్స్‌లో సౌతాఫ్రికా బ్య

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (11:42 IST)
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆట‌గాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం ర్యాకింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ ఏబీ డీ విల్లియ‌ర్స్‌, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్‌ల‌ను వెన‌క్కునెట్టేశాడు. 
 
ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో రెండో మ్యాచులో మిన‌హా కోహ్లీ మిగ‌తా రెండు మ్యాచుల్లో కోహ్లీ రాణించిన సంగతి తెలిసిందే. దీంతో వ‌న్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో త‌న ర్యాంకును మెరుగు ప‌రుచుకున్న కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
ప్ర‌స్తుతం కోహ్లీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో 861 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా, డేవిడ్ వార్నర్. కోహ్లీ కంటే ఒకే ఒక్క పాయింట్ వెన‌క‌బ‌డి 861 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక  ఏబీ డీ విల్లియ‌ర్స్ 847 పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. 
 
ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, వన్డేల్లో నంబర్ వన్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో భారీ డీల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ మొత్తం చెల్లించి కోహ్లీతో డీల్ కుదుర్చుకోవాలని పెప్సీకో ఇంకా తన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే పెప్సీకోతో తన ఒప్పందాన్ని తెంచుకున్నానని కోహ్లీ ప్రకటించాడు.  తాను వినియోగించని శీతల పానీయాలకు ప్రచారం చేయలేనని కోహ్లీ తెగేసి చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 8 సంవత్సరాల కాలానికి తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పెట్టేందుకు ప్రముఖ టైర్ల సంస్థ ఎంఆర్ఎఫ్ కోహ్లీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
 
ఇప్పటికే స్పోర్ట్స్ ఉత్పత్తుల సంస్థ పూమాతో రూ. 100 కోట్ల విలువైన 8 ఏళ్ల కాంట్రాక్టును గతంలో కోహ్లీ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది కోహ్లీకి రెండో 100 కోట్ల డీల్ కావడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త అల్లుడికి 465 వంటకాలతో సంక్రాంతి విందు.. (Video)

సింగర్‌తో కలిసి యువతిపై హర్యానా బీజేపీ చీఫ్ అత్యాచారం!!

టూరిస్ట్ బస్సులో మంటలు - నిజామాబాద్ వాసి సజీవదహనం

దక్షిణాఫ్రికాలో ఘోరం... బంగారు గనిలో చిక్కున్న కార్మికులు.. 100 మంది మృతి

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడిన తండ్రి...!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో రొమాంటిక్ హారర్ జానర్ గా రాజా సాబ్

లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా

విక్రాంత్, చాందినీ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

తర్వాతి కథనం
Show comments