Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అనుష్క శర్మను డివిలియర్స్ కాపాడాడు''.. కోహ్లీ ముద్దులే ముద్దులు.. సోషల్ మీడియాలో?!

Webdunia
బుధవారం, 25 మే 2016 (16:00 IST)
టీమిండియా స్టార్ ప్లేయర్, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు కలిసినా, విడిపోయినా సెన్సేషనల్ న్యూసే. కోహ్లీ ఏదైనా మ్యాచ్‌లో రాణించకపోయినా.. ఆ మ్యాచ్ గెలవకపోయినా.. దానికి అనుష్క శర్మనే కారణమని వార్తలొచ్చే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ తొలి క్యాలిఫైయర్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ మ్యాచ్ లో కోహ్లి డక్ అవుట్ అవ్వడంతో రాయల్ చాలెంజర్స్ కష్టాల్లో పడింది. దీనితో ఈ మ్యాచ్ లో కోహ్లి సేనకు ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. అంతలోపే కోహ్లీ, అనుష్క మళ్లీ కలిశారా అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. కానీ అనూహ్యంగా డివిలియర్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఒంటి చేత్తో జట్టుకు విజయం సాధించిపెట్టాడు. దీంతో అనుష్క శర్మ బతికిపోయింది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడివుంటే అనుష్క శర్మపై విమర్శలు తప్పవు. 
 
అయినా కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు తగ్గలేదు. జట్టు విజయానికి సహకరించిన డివిలియర్స్‌పైకి గంతులేసి కోహ్లీ ముద్దుల వర్షం కురిపించడంపై పలురకాల కామెంట్స్ వస్తున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో ఓడిపోయుంటే తన ప్రియురాలు అనుష్క శర్మపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పించే వాళ్లని అలా జరగక పోవడంతో కోహ్లి ఆనందంతో ఎగరిగంతేశాడని కామెంట్స్ వచ్చాయి. ఇక జడేజా ఒక అడుగు ముందుకు వేసి.. 'అనుష్క శర్మని డివిలియర్స్ కాపాడాడు' అని తన ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments