Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ పిసినారి.. ఎన్నికోట్లు సంపాదించినా లెక్కంటే లెక్కే: యువీ

టీమిండియాలో ఉన్న క్రికెటర్ల అంద‌రి క‌న్నా పెద్ద కంజూస్ ఎవరంటే... టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లియేన‌ని అంటున్నాడు టీం ఇండియా బ్యాట్స్‌మ‌న్ యువ‌రాజ్‌సింగ్‌. ఇటీవల యువీ రేడియో మిర్చీకి ఇచ్చిన ఇ

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (17:42 IST)
టీమిండియాలో ఉన్న క్రికెటర్ల అంద‌రి క‌న్నా పెద్ద కంజూస్ ఎవరంటే... టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లియేన‌ని అంటున్నాడు టీం ఇండియా బ్యాట్స్‌మ‌న్ యువ‌రాజ్‌సింగ్‌. ఇటీవల యువీ రేడియో మిర్చీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ పంచుకున్నాడు. "అన్ని కోట్లు సంపాదిస్తున్న ఖ‌ర్చు విష‌యానికి వ‌స్తే మాత్రం ఈ యంగ్ హీరో తూచా త‌ప్ప‌కుండా లెక్కలు పాటిస్తాడ‌ని'' యువీ చెప్పాడు. 
 
ఎప్పుడు బ‌య‌ట‌కు వెళ్లినా ఖర్చు పెట్ట‌డానికి వెన‌కాడుతాడ‌ని, అంతే కాకుండా నువ్వు దీనికి ఖ‌ర్చు పెట్టు.. నేను దానికి పెడ‌తాను అంటూ లెక్కలేస్తాడ‌ని .. త‌మ పంజాబీ సంస్కృతిలో అంద‌రం క‌లిసి బ‌య‌ట‌కు వెళ్తే ఒక్క‌రే బిల్లు క‌డ‌తార‌ని, కానీ విరాట్ కోహ్లి మాత్రం ఎంతో పిసినారి అని యువీ చెప్పాడు. టీమ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్ కూడా అత‌నేన‌ని అన్నాడు. కోహ్లిలాగే టీమ్‌లోని ఎంతో మంది సీనియ‌ర్ ఆటగాళ్లు కంజూస్‌లే అని చెప్పిన యువీ.. వారి పేర్లు మాత్రం చెప్ప‌లేదు. 
 
అయితే నెహ్రా పేరును మాత్రం అత‌ను ప్ర‌త్యేకంగా చెప్పాడు. ముందు అత‌ను బాగానే ఖ‌ర్చు పెట్టే వాడ‌ని, అయితే పెళ్లయిన త‌ర్వాత భార్యా పిల్లలున్నారని ప‌దేప‌దే అదే కార‌ణం చెబుతూ త‌న‌ను వ‌దిలేయాల‌ని అడిగేవాడ‌ని యువీ చెప్పాడు. అంతేకాదు మీకు న‌చ్చిన బెస్ట్ కెప్టెన్ ఎవ‌రని అడిగితే… త‌న‌కెప్ప‌టికీ సౌర‌వ్ గంగూలీనే బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు యువీ. ఎందుకంటే తన కెరీర్ గంగూలీ నేతృత్వంలోనే ప్రారంభమైందని చెప్పుకొచ్చాడు. ఇలా ఎఫ్ ఎం రేడియోకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యువీ జ‌ట్టులోని కొంద‌రి క్రీడాకారుల ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments