Webdunia - Bharat's app for daily news and videos

Install App

జట్టు విజయం కోసం యవ్వనాన్ని ధారపోశా ... ఈ విజయం అభిమానులకే సొంతం : విరాట్ కోహ్లీ

ఠాగూర్
బుధవారం, 4 జూన్ 2025 (11:37 IST)
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఐపీఎల్ చరిత్రలో గత 18 యేళ్లుగా ఊరిస్తున్న ట్రోఫీని ఆర్సీబీ జట్టు ముద్దాడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా తన సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయం జట్టు సభ్యుల్లో ముఖ్యంగా, జట్టు వెన్నెముకగా నిలిచిన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీలో తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. పంజాబ్ కింగ్స్‌కు 191 పరుగుల సవాలుతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు ప్రతి పరుగుకూ శ్రమించాల్సి వచ్చింది. ఒక దశలో శశాంక్ సింగ్ కేవలం 30 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పిటకీ ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడిని జయించి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్‌ను అత్యంత కట్టుదిట్టంగా వేసిన జోష్ హేజిల్‌వుడ్ బెంగుళూరుకు చిరస్మరణీయ విజయాన్ని ఆందించడంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, నా హృదయం బెంగుళూరుతోనే ఉంది. నా ఆత్మ బెంగుళూరుతోనే ఉంది. నేను ఈ జట్టుకు విధేయుడిగా ఉన్నాను. వేరే ఆలోచనలు వచ్చినప్పటికీ  నేను వారితోనే ఉన్నాను. వారు నాతోనే ఉన్నారు. ఇక విజయంలో గత కొన్నేళ్లుగా నాతోపాటు ఆడిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌కు  కూడా ఉంది. వారు కూడా జట్టు కోసం చాలా ఏళ్లు ఎంతో శ్రమించారు అని కోహ్లీ అన్నారు. 
 
పైగా, ఈ విజయం జట్టు సభ్యులదే. 18 యేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులది కూడా. నా యవ్వనాన్ని, నా అనుభవాన్ని, నా విధేయతను ఈ జట్టుకు అంకితం చేశాను. ఈ క్షణం నాకు సర్వస్వం అని కోహ్లీ ఒకింత భావోద్వేగంతో అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

తర్వాతి కథనం
Show comments