అడిలైడ్‌లో కరోనా కలకలం.. స్వీయ నిర్బంధంలోకి ఆసీస్ ఆటగాళ్లు!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:44 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ రెండు జట్ల మధ్య డిసెంబరు 17వ తేదీన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ జరిగే అడిలైడ్‌లో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత రెండు మూడు రోజులుగా మళ్ళీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆసీస్ ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. వీరిలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు.. మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. 
 
దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భారత్ - ఆసీస్‌ మధ్య అక్కడ డిసెంబరు 17వ తేదీ నుంచి జరుగాల్సిన డే అండ్‌ నైట్‌ టెస్టు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని ప్రకటించింది. అడిలైడ్‌, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా సహా కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కావడంతో దక్షిణ ఆస్ట్రేలియా నుంచి రవాణాను ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే, పర్యాటకులకు 14 రోజుల క్వారంటైన్‌ను మళ్లీ తప్పనిసరి చేసింది. 
 
ఇదిలావుంటే, భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో సభ్యులందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. అయినప్పటికీ సిడ్నీలో క్వారంటైన్‌తో కూడిన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఆసీస్‌తో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ మొదలుకానుంది. కాగా డిసెంబర్‌ 17 నుంచి జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించాలని సీఏ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

తర్వాతి కథనం
Show comments