Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిలైడ్‌లో ఇషాంత్ శర్మ అదరగొట్టాడు.. బంతి వేగానికి స్టంప్స్‌ గాల్లోకి ఎగిరాయ్..

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:50 IST)
ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ విసిరిన బంతి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇషాంత్ శర్మ విసిరిన బంతికి ఆస్ట్రేలియా క్రికెటర్ పించ్ తన వికెట్‌ను సమర్పించుకుని పెవిలియన్ ముఖం పట్టాడు. భారత జట్టు ఇదివరకు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు కప్‌ను గెలుచుకున్న దాఖలాలు లేవు. 
 
అయితే ఈ సారి ఆసీస్ గడ్డపై ట్రోఫీని గెలుచుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో అడిలైడ్ తొలి టెస్టు, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు సాధించి ఆలౌటైంది. బ్యాటింగ్‌లో భారత క్రికెటర్లు ధీటుగా రాణించలేకపోయారు. అయితే పూజారా మాత్రం 123 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పించ్‌ను ఇషాంత్ శర్మ అద్భుత బౌలింగ్‌తో పడగొట్టాడు. 
 
ఇషాంత్ శర్మ విసిరిన మూడో బంతికి ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పించ్ ధీటుగా ఎదుర్కోలేకపోయాడు. దీంతో భారీ వేగంతో ఇషాంత్ బాల్ స్టంప్‌ను విరగ్గొట్టింది. ఆ బంతి వేగానికి మరో రెండు స్టంప్స్ కూడా గాల్లోకి ఎగిరి పడ్డాయి. దీంతో పించ్ పెవిలియన్ దారి పట్టాడు. ఇషాంత్ శర్మ పించ్ వికెట్‌ను పడగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments