Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీపై కేటీఆర్ ప్రశంసల జల్లు.. అత‌నో అసాధార‌ణ ఫినిష‌ర్

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (16:21 IST)
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తన ట్విట్టర్‌ పేజీలో ధోనీని కొనియాడాడు. ధోనీకి వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్రమే అని కేటీఆర్ పోస్ట్ చేశారు.
 
ధోనీ ఓ ఛాంపియ‌న్ క్రికెట‌ర్ అని, అత‌నో అసాధార‌ణ ఫినిష‌ర్ అని కితాబిచ్చారు. రోజు రోజుకు ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ మ‌రింత ప‌రిణితి చెందుతున్నాడని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. 
 
చివరి 4 బంతుల్లో చెన్నై జట్టు 16 పరుగులు చేయాల్సిన స్థితిలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ మరోసారి తనదైన శైలిలో వరుసగా 6, 4, 2, 4 పరుగులతో మ్యాచ్‌ను గెలిపించాడు. 
 
కాగా ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు  మాత్రం వరుసగా ఏడో పరాజయాన్ని మూటగట్టుకుంది. 

సంబంధిత వార్తలు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

తర్వాతి కథనం
Show comments