Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్‌లో భారత్ ఏయే తేదీల్లో మ్యాచ్‌లు ఆడనుందో మీకు తెలుసా?

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (19:23 IST)
క్రికెట్ ప్రపంచకప్ నిన్న ఇంగ్లండ్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈరోజు పాకిస్థాన్ విండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. 
 
కాగా భారత జట్టు ఆడే మ్యాచ్‌లు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. క్రికెట్ అభిమానులు మధ్యాహ్నం 3 గంటల నుండి మ్యాచ్‌ను లైవ్ ద్వారా వీక్షించవచ్చు. భారత జట్టు ఎప్పుడెప్పుడు ఏయే జట్లతో తలపడుతుందో ఓసారి మీరూ చూడండి.
 
1) భారత్-దక్షిణాఫ్రికా మధ్య జూన్ 5వ తేదీన బుధవారం నాడు మ్యాచ్ జరగనుంది.
2) భారత జట్టు జూన్ 9వ తేదీన ఆదివారం నాడు ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.
3) జూన్ 13 గురువారం నాడు న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది.
 
4) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఈ మ్యాచ్ జూన్ 16 ఆదివారం నాడు జరగనుంది.
5) భారత్-అఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 22వ తేదీన శనివారం నాడు మ్యాచ్ జరగనుంది.
6) జూన్ 27వ తేదీ గురువారం నాడు విండీస్ జట్టుతో మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది.
 
7) భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 30వ తేదీ ఆదివారం నాడు మ్యాచ్ జరగనుంది.
8) భారత్-బంగ్లాదేశ్ జట్లు జూలై 2వ తేదీ తలపడనున్నాయి.(మంగళవారం)
9) ఇక లీగ్ మ్యాచ్‌ల్లో చివరగా భారత్ శ్రీలంక జట్టుతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ జూలై 6వ తేదీన (శనివారం) జరగనుంది. 
 
కాగా ఈ మ్యాచ్‌లు అన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుండడం విశేషం..

సంబంధిత వార్తలు

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

తర్వాతి కథనం
Show comments