Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లో భారత్‌తో మ్యాచ్.. మెరిసిన అర్షదీప్- పాకిస్థాన్ స్కోర్ ఇదే

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (16:05 IST)
మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్‌లో టీమిండియాకు అర్షదీప్ శుభారంభాన్ని ఇచ్చాడు.  టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్‌కు అర్షదీప్ చుక్కలు చూపించాడు.  
 
లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్షదీప్ సింగ్ ఓపెనింగ్ స్పెల్‌లో విజృంభించాడు. పాకిస్థాన్ ప్రమాదకర ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్ (0), మహ్మద్ రిజ్వాన్ (4)లను స్వల్ప స్కోర్లకే వెనక్కి పంపాడు.
 
తొలుత స్వింగ్ డెలివరీతో బాబర్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓ బౌన్సర్‌తో రిజ్వాన్‌ను బోల్తాకొట్టించాడు. దాంతో పాకిస్థాన్ 15 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. 
 
అయితే షాన్ మసూద్ మాత్రం అర్థసెంచరీతో అదరగొట్టాడు. పాక్ బ్యాట్స్‌మెన్లలో షాన్ మసూద్ (50), ఇఫ్తికార్ అహ్మద్ (51) ధీటుగా రాణించారు. 
 
మిగిలిన వారంతా పది పరుగులు కూడా దాటలేకపోయారు. షహీన్ షా అఫ్రిది (16) పరుగులు సాధఝించాడు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments