మిచెల్ భారీ సిక్స్.. అభిమాని బీర్ గ్లాస్ పగిలిపోయింది.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (15:21 IST)
Daryl Mitchell
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ భారీ సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ బంతి గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని చేతిలోని బీర్ గ్లాస్‌ను పగులకొట్టింది. ఈ బంతి నేరుగా వెళ్లి బీర్ గ్లాస్‌లో పడటంతో అంతా కిందపోయింది.
 
చల్లగా బీర్ తాగుతూ మ్యాచ్ ఎంజాయ్ చేయాలనుకున్న ఆ లేడీ ఫ్యాన్.. మిచెల్ సిక్సర్ దెబ్బకు షాక్‌కు గురైంది. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ప్లేయర్ మాథ్యూ పాట్స్.. బీర్ గ్లాస్ పగిలిన విధానాన్ని సైగలతో సహచర ఆటగాళ్లకు వివరించడం ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
 
ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన ఇన్నింగ్స్ 56వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతను వేసి ఫ్లైటెడ్ డెలివరీని మిచెల్ స్ట్రైట్‌గా సిక్సర్ బాదాడు. బంతి కాస్త సుసాన్ అనే లేడీ ఫ్యాన్ చేతిలోని బీర్ గ్లాస్‌లో పడింది. 
 
కామెంటేటర్లు సైతం ఈ ఘటనను చూసి ఆశ్చరపోయారు. నవ్వుతూ ఈ సంఘటనను వివరించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న న్యూజిలాండ్ టీమ్.. సదరు అభిమానికి మరో బీర్ గ్లాస్ ఇప్పించింది. దాంతో ఆమె హాయిగా బీర్ తాగుతూ మిచెల్ బ్యాటింగ్‌ను ఆస్వాదించింది.

ఈ తొలి రోజు ఆట అనంతరం సదరు లేడీ ఫ్యాన్‌ను కలిసిన డారిల్ మిచెల్.. ఆమెకు క్షమాపణలు చెప్పాడు. బీర్ వలకబోసినందుకు క్షమించండని స్వయంగా కోరాడు. దీనికి సంబంధించిన వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

తర్వాతి కథనం
Show comments