Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని రేప్ చేసిన లంక క్రికెటర్ స్నేహితుడు... సస్పెన్షన్

శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకపై సస్పెన్షన్ వేటుపడింది. చెడునడత కారణంగా లంక క్రికెట్ బోర్డు వేటువేసింది. ఈ క్రికెటర్ స్నేహితుడిపై అత్యాచారం కేసు నమోదు కావడంతో లంక బోర్డు ఈ చర్య తీసుకుంది. తాజాగా వెల

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (09:01 IST)
శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకపై సస్పెన్షన్ వేటుపడింది. చెడునడత కారణంగా లంక క్రికెట్ బోర్డు వేటువేసింది. ఈ క్రికెటర్ స్నేహితుడిపై అత్యాచారం కేసు నమోదు కావడంతో లంక బోర్డు ఈ చర్య తీసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా తాను ఉంటున్న హోటల్‌కు ధనుష్క, అతడి స్నేహితుడు కలిసి ఇద్దరు నార్వే యువతులను తీసుకెళ్లారు. ఈ యువతులతో వారు ఎంజాయ్ చేశారు. అయితే ఈ ఇద్దరు యువతుల్లో ఒకరు క్రికెటర్‌ స్నేహితుడు తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో శ్రీలంక సంతతికి చెందిన బ్రిటిషర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే గుణతిలకపై ఎటువంటి ఆరోపణలూ నమోదు కాలేదని తెలిపారు. కానీ క్రమశిక్షణ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన శ్రీలంక క్రికెట్‌.. చెడు నడత కారణంగా గుణతిలకపై సస్పెన్షన్‌ వేటు వేసింది. 
 
నిబంధనల ప్రకారం అర్థరాత్రికల్లా ఆటగాళ్లు హోటల్‌ గదికి చేరుకోవాలి, అతిథులను రూమ్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకూడదు. కానీ, గుణతిలక అందుకు విరుద్ధంగా ప్రవర్తించి నిబంధనలను అతిక్రమించినందుకుగాను ఆయనపై వేటుపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

తర్వాతి కథనం
Show comments