Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 ప్రపంచ కప్ విజయోత్సవ ఊరేగింపునకు ముంబై సిద్ధం

వరుణ్
గురువారం, 4 జులై 2024 (13:40 IST)
యావత్ భారతదేశం గర్వపడేలా టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ కప్‌తో దేశ రాజధాని ముంబైలో విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనాలంటూ అభిమానులను ఆహ్వానించింది. ఈ మేరకు రోహిత్ శర్మ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. 
 
గురువారం భారత్‌కు చేరుకున్నాక టీమిండియా ప్రధాని మోడిని కలిసింది. అనంతరం, టీం సభ్యులందరూ చార్టెడ్ ఫ్లైట్ ముంబై చేరుకుంటారు. ఆ తరువాత విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వాంఖడే చేరుకుంటారు. ఈ క్రమంలో ఓపెన్ బస్ కవాతు చేద్దామని నిర్ణయించారు. పరేడ్‌లో పాల్గొనేందుకు రావాలంటూ అభిమానులను టీమిండియా రథసారధి రోహిత్ శర్మ ఆహ్వానించాడు.
 
'ఈ ప్రత్యేక క్షణాల్ని మీ అందరితో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. జులై 4 సాయంత్రం 5 గంటలకు మెరీన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకూ జరిగే పరేడ్‌లో మనందరం పాల్గొని భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం' అని రోహిత్ శర్మ పోస్టు పెట్టాడు. అలాగే, బీసీసీఐ అధ్యక్షుడు జై షా కూడా ఈ వేడుకల్లో అభిమానులు సైతం పాల్గొనాలని పిలుపునిచ్చారు.
 
ముంబైలోని నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే వరకూ ఓపెన్ బస్ పరేడ్ ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో జై షా టీమిండియా సభ్యులకు రూ.125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేస్తారు. ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్ పేరున్న ప్రత్యేక చార్టెడ్ విమానం టీంసభ్యులతో బార్బడాస్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.50 గంటలకు బయలుదేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments