Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ట్వంటీ20 సిరీస్ : నేడు ఫైనల్ మ్యాచ్

ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో పర్యాటక భారత్ జట్టు నేడు తుది సమరంలో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచి.. సౌతాఫ్రికా గడ్డపై ఆధిపత్యం సాధించాలని కసితో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. తద్వారా

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (12:54 IST)
ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో పర్యాటక భారత్ జట్టు నేడు తుది సమరంలో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచి.. సౌతాఫ్రికా గడ్డపై ఆధిపత్యం సాధించాలని కసితో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. తద్వారా చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్నారు కుర్రోళ్లు.
 
ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన.. అదే ఊపు ట్వంటీ20 సిరీస్‌లోనూ కొనసాగిస్తోంది. బ్యాటింగ్‌లో బలంగా ఉంది. ఓపెనర్ రోహిత్ కూడా ఫాంలోకి రావటంతో టాప్ ఆర్డర్ మొత్తం దుమ్మురేపటానికి రెడీ అంటోంది. ధావన్, రైనా, కోహ్లీ, మనీశ్ పాండే, ధోనీ బ్యాంటింగ్ తో మెరుపులు ఖాయం అంటున్నారు. 
 
ఇకపోతే బౌలింగ్‌లోనే తడబాటు కనిపిస్తోంది. గాయంతో రెండో టీ-20కి దురమైన బుమ్రా.. ఈ మ్యాచ్‌లో ఆడటం కష్టమే. పేసర్ జయదేవ్ రాణిస్తే మాత్రం టీమిండియాదే పైచేయి. చాహల్, శార్దూల్ ఠాకూర్ పరుగులు ఇవ్వటంలో పిసినారితనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికితోడు కేప్ టౌన్ గ్రౌండ్ సెంటిమెంట్‌గా భారత్ అచ్చొచ్చిన పిచ్.
 
సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది. అందరూ కొత్త ఆటగాళ్లు. ఇది టీమిండియాకు మైనస్. ఎవరు ఎలా ఆడతారో పూర్తిగా అవగాహన లేదు. దీనికితోడు బ్యాటింగ్ కంటే బౌలింగ్ చాలా బలంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కేశినేని నాని..?

కిడ్నీదానం చేసి భర్తను బతికించుకున్న మహిళ.. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

తర్వాతి కథనం
Show comments