Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమె చేసిన సాహసం భారతదేశాన్ని అగ్రదేశాల సరసకు చేర్చింది... ఏంటది? ఎవరు?(వీడియో)

భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారనేందుకు మరో ఉదాహరణ. అంతేకాదు... ఆమె చేసిన సాహసం భారతదేశాన్ని అగ్రదేశాల సరసకు చేర్చింది. ఆమె పేరు అవానీ చతుర్వేది. ఇప్పుడీమెకు దేశం నలుమూలల నుంచి ప్రశంసల వ

ఆమె చేసిన సాహసం భారతదేశాన్ని అగ్రదేశాల సరసకు చేర్చింది... ఏంటది? ఎవరు?(వీడియో)
, గురువారం, 22 ఫిబ్రవరి 2018 (16:38 IST)
భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారనేందుకు మరో ఉదాహరణ. అంతేకాదు... ఆమె చేసిన సాహసం భారతదేశాన్ని అగ్రదేశాల సరసకు చేర్చింది. ఆమె పేరు అవానీ చతుర్వేది. ఇప్పుడీమెకు దేశం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేసింది. తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
 
సహజంగా భారత వాయుసేనలో మహిళలు చాలా తక్కువ సంఖ్యలో వుంటారు. వారు కూడా శక్తివంతమైన, అత్యంత వేగవంతమైన అధునాతన విమానాలను నడిపేందుకు జంకుతుంటారు. అలాంటివాటన్నిటికీ స్వస్తి పలుకుతూ మహిళలు క్రమంగా తమ నైపుణ్యాలను పెంచుకుని మగవారితో సమానంగా ముందుకు దూసుకెళుతున్నారు. అవాని చతుర్వేది ఫైటర్ జెట్ మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని సుమారు 30 నిమిషాల పాటు ఆకాశంలో రివ్వున చక్కెర్లు కొట్టిస్తూ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 
 
ఇలాంటి ఫీట్ చేసిన తొలి భారత మహిళగా ఆమె రికార్డులకెక్కింది. ముఖ్యంగా ఆమె ఒంటరిగానే ఈ ఫీట్ చేసింది. సోమవారం నాడు ఆమె ఈ సాహసాన్ని అవలీలగా చేసేసినట్లు వాయుసేన అధికారులు వెల్లడించారు. మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అవానీ చతుర్వేది గురించి ఇప్పుడు మరింత తెలుసుకుందాం.
 
webdunia
24 ఏళ్ల అవానీ చతుర్వేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో జన్మించింది. బనస్థలి యూనివర్శిటీలో బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసింది. ఆ సమయంలోనే ఆమె ఫ్లైయింగ్ క్లబ్‌లో చేరింది. అంతేకాదు వాయుసేన నిర్వహించే పరీక్షలోనూ ఉత్తీర్ణురాలయ్యింది.
 
అనంతరం హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుంది. ఆర్మీలో తన సోదరుడే ఆమెకు స్ఫూర్తి అని చెప్పుకుంటుంది అవానీ. ప్రస్తుతం అవానీ యుద్ధ విమానం మిగ్-21 నడపడంతో మన దేశం అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, పాకిస్తాన్ దేశాల సరసన నిలిచినట్లయింది.

అవానీ స్టేజ్ 3 శిక్షణ కూడా పూర్తి చేసుకుంటే సుఖోయ్, తేజాస్ వంటి జెట్ స్పీడుతో వెళ్లే యుద్ధ విమానాలను నడిపే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. ఈ శిక్షణ కర్నాటకలో పూర్తి చేయాల్సి వుంది. ఈ శిక్షణను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని ఆశిద్దాం. వీడియో...

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీచర్లు కూడా తుపాకీ పడితే..? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్