Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరంత టార్గెట్.. ఉత్కంఠభరిత పోరులో ఎట్టకేలకు భారత్ గెలుపు

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (12:57 IST)
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఎట్టకేలకు గెలిచింది. గోరంత లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ అపపోసాలు పడింది. చివరకు అశ్విన్, అయ్యర్ పోరాట ఫలితంతో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌తో గెలుపొందింది. అశ్విన్ (42 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (29 నాటౌట్)లు కలిసి ఎనిమిదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఉత్కంఠ భరిత పోరులో భారత్ గెలుపొందింది. 
 
నిజంగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లను ఇష్టపడే క్రికెట్ అభిమానులకు ఈ టెస్ట్ మ్యాచ్ అసలైన మజాను పంచింది. గత రెండో రోజులు అనూహ్య మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరకు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో విజయభేరీ మోగించింది. నాలుగో రోజైన ఆదివారం విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ఫలితంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ చివరకు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
 
బంగ్లాదేశ్ నిర్ధేశించిన 145 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఆటగాళ్లలో రాహుల్ 2, గిల్ 7, పుజార 6, కోహ్లీ ఒక్క పరుగులు, రిషభ్ పంత్ 9 చొప్పున పరుగులు చేసి చేతులెత్తేశారు. దీంతో ఓ దశలో టీమిండియా 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ ఒక్కడే 34 పరుగులతో రాణించాడు. 
 
ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన అశ్విన్, శ్రేయాస్ అయ్యర్‌ను జట్టును గెలిపించే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆచితూచి జాగ్రత్తగా ఆడుతూ ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా భారత జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందారు. అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. పుజారుకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 
 
రెండో టెస్ట్ మ్యాచ్ సంక్షిప్త స్కోరు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ .. 227
భారత్ తొలి ఇన్నింగ్స్.. 231
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్.. 314
భారత్ రెండో ఇన్నింగ్స్ .. 145/7

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments