కార్గిల్‌లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గురాలేదా? ఆఫ్రిదికి ధావన్ కౌంటర్

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (11:40 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది నోరు పారేసుకున్నారు. దీనికి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గట్టిగా కౌంటరిచ్చాడు. కార్గిల్‌లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గు రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
ఇటీవల పాకిస్థాన్ టీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ, భారత భద్రతా దళాల వైఫల్యం వల్లే దాడి జరిగిందని ఆరోపించారు. భారత సైన్యం సామర్ధ్యాన్ని ప్రశ్నించారు. కాశ్మీర్‍లో 8 లక్షల మంది సైనికులు ఉన్నా ప్రజలకు భద్రత కల్పించలేకపోయారని విమర్శించారు. దీనిని బట్టి వారు అసమర్థులని అర్థమవుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై శిఖర్ ధావన్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కార్గిల్‌లో ఓడించాం. గుర్తులేదా. ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకా ఎంత దిగజారుతారు. అనవసర వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశాభివృద్ధిపై దృష్టిసారించండి. మా భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. భారత్ మాతాకీ జై .. జైహింద్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments