విడిపోయిన శిఖర్ - అయేషా దంపతులు.... 9 యేళ్లకే ముగిసిన ప్రేమ పెళ్లి

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:54 IST)
భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ -అయేషా ముఖర్జీ దంపతులు విడిపోయారు. తొమ్మిదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఓ బిడ్డ ఉంది. వీరిద్దరూ ఇపుడు విడిపోయారు. దీంతో ఈ జంట ప్రేమ పెళ్లి 9 ఏళ్లకే ముగిసింది. తామిద్దరం విడిపోతున్నట్టు అయేషా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించి అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 
మెల్‌బోర్న్ బాక్సర్ అయిన అయేషాకు ధావన్‌తో వివాహానికి ముందే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత మొదటి వివాహానికి స్వస్తి చెప్పిన అయేషా ధావన్‌తో ప్రేమలో పడింది. 2012లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు (జొరావర్) కూడా ఉన్నాడు.
 
తాజాగా, తామిద్దరం విడిపోతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన అయేషా..  వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తిమంతమైవని పేర్కొంది. తొలిసారి విడాకులు తీసుకుంటున్నప్పుడు తాను చాలా భయపడ్డానని, జీవితంలో ఓడిపోయినట్టు, తప్పు చేస్తున్న భావన తనను పట్టి పీడించేవని పేర్కొంది.
 
రెండోసారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదమే తనకు చాలా చెత్తగా అనిపించేదని తెలిపింది. తల్లిదండ్రులను, పిల్లలను చాలా నిరాశకు గురిచేశానని భావించానని, ఇప్పుడు రెండోసారి విడాకుల ఊహే భయంకరంగా ఉందని వివరించింది. అయితే, ఈ విడాకుల విషయమై శిఖర్ ధావన్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments