Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ కి"లేడి" ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంది.. భర్తల్లో ఆ టెన్షన్.. ఏంటది..?

ఆ కి
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:57 IST)
పెళ్లి కావాల్సిన యువకులే ఆమె టార్గెట్..  విడాకులతో ఒంటరిగా ఉన్నవారిని ఏరికోరి పట్టుకునేది. వారిని ప్రేమిస్తున్నానని వలలో వేసుకుని వివాహం చేసుకునేది. పది రోజులు కూడా కాపురం  చేయకుండా.. ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకునేది. 
 
ఆ విడాకులకు భారీ ఎత్తున భరణం చెల్లించుకుని ఉడాయిస్తున్న ఓ ఘరానా మహిళ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఏకంగా 8 మందిని భర్తలుగా చేసుకుని మోసం చేసింది.  ఇలా మోసం చేసిందనుకుంటే.. ఆ ఎనిమిది మంచి భర్తలకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఆ మహిళకు ఎయిడ్స్‌ సోకింది. దీంతో తమకు కూడా సోకిందేమో ఆందోళనలో ఆ భర్తలు ఉన్నారు.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానా, కైతల్ జిల్లాకు చెందిన మహిళ 2010లో ఓ వ్యక్తిని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అయితే నాలుగేళ్ల తర్వాత ఏమైందో ఏమో కానీ ఆమె భర్త అదృశ్యమయ్యాడు. భర్త వదిలేయడంతో ఇక ఏ దిక్కు లేక బతకడం కష్టంగా మారింది. 
 
బతుకుదెరువు కోసం మోసాలకు పాల్పడడం ప్రారంభించింది. హర్యానాతో పక్కనే ఉన్న పంజాబ్‌లోనూ మోసాలు చేయడం మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం భార్యలను కోల్పోయిన వారిని, బ్రహ్మచారులే. అలా 8 మందిని పెళ్లి చేసుకుని మోసానికి పాల్పడింది. 
 
తన తల్లితో కలిసి మాటల్లో దింపి అవివాహితులను.. భార్యలను వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం అలవాటుగా చేసుకుంది. ఏ గుడిలోనూ.. లేదా మరోచోటను నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వారితో కాపురం మొదలుపెడుతుంది. పెళ్లయిన పది రోజులకు ఆమె తన డ్రామా మొదలు పెట్టి ఏదో రకంగా వారిని వదిలించుకుంటుంది. ఆమెపై గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.
 
9వ పెళ్లి చేసుకోబోతుండగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆ పెళ్లిని నిలిపివేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ సోకిందని నిర్ధారణ అయ్యింది. 
 
ఆమె ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 8 మంది భర్తలు ఈ విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. తమకు ఎక్కడ సోకిందేమోనని ఆ మాజీ భర్తలు ఆందోళన చెందుతున్నారు. వారికి కూడా పోలీసులు పరీక్షలు చేయించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబూల్ విమానాశ్రయం మూసివేత : తాలిబన్ల నిర్ణయం