Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ చాహర్ సూపర్ క్యాచ్.. నెటిజన్లు ఫిదా (video)

Webdunia
గురువారం, 29 జులై 2021 (12:00 IST)
Rahul Chahar
టీమిండియా యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో బుధవారం జరిగిన రెండో టీ20లో బౌండరీ లైన్ వద్ద మైమరిపించే ఫీల్డింగ్ విన్యాసంతో ఔరా అనిపించాడు. అతని సూపర్ ఫీల్డింగ్‌కు శ్రీలంక డేంజరస్ ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో(11) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. దాదాపు సిక్సర్‌గా వచ్చిన బంతిని చాకచక్యంగా అందుకున్న రాహుల్.. 6 పరుగులు సేవ్ చేయడంతో పాటు కీలక వికెట్‌లో భాగమయ్యాడు.
 
భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతిని ఫెర్నాండో ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లింది. కానీ ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ చాహర్.. బౌండరీ లైన్ మీద అద్భుతంగా అందుకున్నాడు. 
 
అయితే సమన్వయం కోల్పోతున్నానని గ్రహించిన అతను బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ తిరిగి వచ్చి అందుకున్నాడు. ఈ తరహా క్యాచ్‌లు ఈ రోజుల్లో సర్వసాధారణమైనప్పటికీ.. ఈ సిరీస్‌లో మాత్రం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ సూపర్ క్యాచ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

తర్వాతి కథనం
Show comments