Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బావగారూ.. బావగారూ..' అంటూ కేకలు.. సానియా మీర్జా వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (10:55 IST)
ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో తమ పరాజయాల పరంపరకు బ్రేక్‌ వేస్తూ.. పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మెంటార్‌ ధోని పాక్‌ ఆటగాళ్లను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్న ఫొటోలు వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే.
 
ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి సేన బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న షోయబ్‌ మాలిక్‌ను ఉద్దేశించి... కొంతమంది అభిమానులు.. ''బావగారూ.. బావగారూ..'' అంటూ సంతోషంతో కేకలు వేశారు.
 
ఈ వీడియోను సానియా మీర్జా రీషేర్‌ చేయగా... నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఇరు దేశాల అభిమానులు.. ''ఇది చాలా క్యూట్‌గా ఉంది'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సానియా మీర్జా సైతం.. స్మైలింగ్‌ ఎమోజీలతో పాటు రెండు హార్ట్‌ సింబల్స్‌ జతచేసి హర్షం వ్యక్తం చేశారు. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ 2018లో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
 
ఇక మాలిక్‌ కెరీర్‌ విషయానికొస్తే చాలా కాలంగా జట్టుకు దూరమైన షోయబ్‌ మాలిక్‌కు అనూహ్యంగా టీ20 వరల్డ్‌కప్‌ ఆడే జట్టులో ఆఖరి నిమిషంలో చోటు దక్కింది. సోహైబ్‌ మక్సూద్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో మాలిక్‌ జట్టులోకి వచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments