Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గోల్డెన్ బ్యాట్' దక్కించుకున్న 'హిట్ మ్యాన్'

Webdunia
సోమవారం, 15 జులై 2019 (10:20 IST)
భారత పరుగుల యంత్రం రోహిత్ శర్మ. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో పరుగుల వరద పారించాడు. ఏకంగా ఐదు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ చేసి తన సత్తా చాటాడు. తద్వారా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కి, ఐసీసీ ప్రదానం చేసే గోల్డెన్ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. 
 
ఈ టోర్నీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ... ఐదు సెంచరీలతో రికార్డులకెక్కి, మొత్తం 648 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 549 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 548 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. 
 
నిజానికి నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ శర్మను అధిగమించే అవకాశం రూట్, కేన్ విలియమ్సన్‌లకు దక్కినా సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. రూట్ ఏడు పరుగులకే అవుటవగా, కేన్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా, రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. 
 
ఓ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. ప్రపంచకప్‌లలో ఆరు సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా సచిన్ సరసన చేరాడు. కాగా, ఈ టోర్నీలో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లీ సేన 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

తర్వాతి కథనం
Show comments