Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో 'నిన్ను కూడా...' అంటున్న క్రికెటర్ పంత్... ఆమె ఏమన్నదో తెలుసా?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (14:26 IST)
ఆసీస్ గడ్డపై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్ ప్రేమలో పడ్డాడు. సహజంగా చాలామంది తమ ప్రేమలను దాచుకుంటారు. మీడియా గోలగోల చేశాక విషయాన్ని అంగీకరిస్తుంటారు. కానీ పంత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. చక్కగా తన ప్రియురాలితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.  
 
దాని కింద ఇలా రాశాడు... 'నేను సంతోషంగా ఉన్నానంటే నువ్వే కారణం... నిన్ను కూడా సంతోషంగా ఉంచడమే ఇక నేను చేయాల్సింది'. అతడి ప్రియురాలు కూడా అవే ఫోటోలను షేర్ చేస్తూ... 'నా మనిషి, నా సోల్‌మేట్, నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రియుడు' అంటూ పరిచయం చేసేసింది. ఈ ఫోటోలను చూసిన పంత్ అభిమానులు విషెస్ చెపుతున్నారు.
 
ఇకపోతే పంత్ ప్రేమించిన అమ్మాయి పేరు ఇషా నేగి. ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న ఆమె వ్యాపారవేత్త. కాగా మీ ఇద్దరి పరిచయం ఎలా కలిగిందంటూ మరికొందరు ఈమెతోపాటు పంత్‌ను ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

తర్వాతి కథనం
Show comments