కోహ్లి, రోహిత్‌ శర్మకు విశ్రాంతి.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (13:39 IST)
వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో టీమిండియా దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది.vతొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైన కోహ్లి సేన... కీలకమైన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో సెమీస్‌ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, కోహ్లి సారథ్యం, మేనేజ్‌మెంట్‌ తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.
 
మరోవైపు... కాసులు కురిపించే ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లను తీవ్ర శ్రమకు గురిచేసి... మానసిక ప్రశాంతత లేకుండా చేసి ఐసీసీ టోర్నీలో ఫలితం అనుభవించేలా చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం బయోబబుల్‌లో ఉండటం ఇబ్బందిగా ఉందని చెప్పకనే చెప్పాడు.
 
తమకు విశ్రాంతి అవసరమని, నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండటం మానసిక ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చాడు. ఆటపై ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తిక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది నవంబరులో న్యూజిలాండ్‌ భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.
 
ఈ సందర్భంగా మూడు టీ20 మ్యాచ్‌లు, 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి సీనియర్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌కు టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోందిగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ పగ్గాలు చేపట్టడం లాంఛనమే కాగా.. అతడికి డిప్యూటీగా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం
Show comments