Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్‌కు దూరమైన రవీంద్ర జడేజా

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (19:53 IST)
భారత క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజా ఎంతో కీలకమైన ఆటగాడు. ఈ ఆల్‌రౌండర్ ఇపుడు ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. ఈ టోర్నీ వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనుంది. అయితే, మోకాలికి ఆపరేషన్ కారణంగా జడేజీ ఈ టో్ర్నీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, జడేజాకు ఏ విధంగా గాయం ఏర్పడిందన్న విషయం ఇపుడు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 
జడేజాకు గాయం ఎలా తగిలిందంటే.. ఆసియా కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు దుబాయ్‌లో ఓ స్టార్ హోటల్‌లో బస చేసింది. ఖాళీ సమయంలో దుబాయ్ సముద్ర జలాల్లో జలక్రీడలకు రవీంద్ర జడేజా వెళ్లి గాయపడ్డాడు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్‌లో స్కీబోర్డు జలక్రీడను ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన జడేజాకు మోకాలుకు దెబ్బ తగిలింది. ఆ గాయం తీవ్రమైనది కావడంతో జడేజా ముంబైకి వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన బీసీసీఐ జడేజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు ఆసియా కప్ జరుగుతుండగా, మరికొన్ని రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగాల్సివుంది. ఇలాంటి తరుణంలో జలక్రీడలు ఏంటని మండిపడుతోంది. మొత్తంమీద రవీంద్ర జడేజా స్వయంకృతాపరాధం వల్ల ఇపుడు ఆయన ఏకంగా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి దూరం కావాల్సివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

తర్వాతి కథనం
Show comments