Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 జట్టుకు కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. ప్రపంచకప్ దృష్ట్యా ఎంపిక

Webdunia
బుధవారం, 7 జులై 2021 (12:56 IST)
ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 క్రికెటర్లలో ఒకరైన రషీద్ ఖాన్‌కు పెద్ద బాధ్యతలు అప్పగించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. రషీద్ ఖాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించింది.

రషీద్ ఖాన్‌ను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నజ్‌బుల్లా జద్రాన్‌ను టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. వన్డే, టెస్టు జట్లకు హస్మతుల్లా షాహిది కెప్టెన్ అయ్యారు.
 
రషీద్ ఖాన్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ టీ20, వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. అతని కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ 16వన్డేల్లో ఆరు గెలిచింది. 2019 ప్రపంచకప్ తరువాత, రషీద్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు ముందు గుల్బాదిన్ నాయిబ్ స్థానంలో రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించారు.
 
అయితే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఎక్కువరోజులు ఉండలేదు. జట్టు కెప్టెన్సీకి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తుండగా.. రషీద్ ఖాన్ స్థానంలో అస్గర్ ఆఫ్ఘన్‌ను కెప్టెన్‌గా నియమించింది. కానీ బోర్డు ఈ ఏడాది మేలో అతనిని తొలగించింది. ఇప్పుడు మరోసారి మార్పులు చేసింది.
 
రషీద్ ఖాన్‌ను ఆటతీరు ఆధారంగా జట్టు కెప్టెన్‌గా చెయ్యాలని నిర్ణయించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా.. రషీద్‌ఖాన్ నియామకం జరిగినట్లుగా చెబుతున్నారు.

ఈ ఏడాది UAEలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రషీద్ ఖాన్‌ను జట్టుకు కెప్టెన్‌గా మార్చారు. రషీద్ ఖాన్ కెప్టెన్సీలో జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments