Webdunia - Bharat's app for daily news and videos

Install App

దయచేసి మా పాప ఫోటోలు తీయొద్దు : విరాట్ కోహ్లీ వినతి

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (16:15 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. అయితే, విరాట్ కోహ్లీ ఫోటోగ్రాఫర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. 
 
ద‌య‌చేసి మా పాప ఫొటోలు తీయొద్దు అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శ‌ర్మ ముంబై ఫొటోగ్రాఫ‌ర్ల‌ను కోరారు. త‌మ కూతురి ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని వారు ఫొటోగ్రాఫ‌ర్ల‌కు రాసిన లేఖ‌లో అడిగారు. 
 
'ఇన్నేళ్లు మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. పాప పుట్టిన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మేం మిమ్మల్ని కోరేది ఒక్కటే. మా బిడ్డ ప్రైవసీని మేము కాపాడాలి. ఈ విషయంలో మీ మద్దతు, మీ సాయం మాకు కావాలి. దయచేసి మా బిడ్డకు సంబంధించి ఏ ఫొటోనూ ప్రచురించొద్దు. కావాలంటే మాకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వేసుకోండి. మా విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం' అంటూ విజ్ఞప్తి చేశారు. 
 
అలాగే, స‌రైన స‌మ‌యంలో త‌మ పాప ఫొటోల‌ను రిలీజ్ చేస్తామ‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 11న త‌మ‌కు పాప పుట్టింద‌ని కోహ్లి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత విరాట్ సోద‌రుడు వారికి కంగ్రాట్స్ చెబుతూ.. ఓ ఫొటో షేర్ చేయ‌డంతో అది వాళ్ల పాప‌దే అంటూ అభిమానులు వైర‌ల్ చేసేశారు. కానీ ఆ ఫొటో ఆ పాప‌ది కాదు అని మ‌రోసారి కోహ్లి సోద‌రుడు వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

తర్వాతి కథనం
Show comments