భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.
సోమవారం మధ్యాహ్నం తమకు బిడ్డ పుట్టిందనే విషయాన్ని మీకు తెలియజేయడానికి ఎంతో థ్రిల్ ఫీలవుతున్నానని కోహ్లీ ట్వీట్ చేశాడు. మీ అందరి ప్రేమాభిమానాలకు, ప్రార్థనలకు, విషెస్‌కు ధన్యవాదాలు అని తెలిపాడు.
కాగా, అనుష్క, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. తల్లిదండ్రులుగా తామిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఈ సమయంలో తమకు కొంత ప్రైవసీ కావాలన్నారు.
ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరాడు. మరోవైపు తల్లిదండ్రులైన కోహ్లీ, అనుష్కలకు అభిమానుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ప్రసవం సమయంలో భార్యవద్దే ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా క్రికెట్ పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే.