Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

ముందుండి నడిపించిన నిజమైన నాయకుడు రహానే.. మాజీ ప్రశంసల వర్షం

Advertiesment
Ajinkya Rahane
, మంగళవారం, 29 డిశెంబరు 2020 (17:28 IST)
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత విజయభేరీ మోగించింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. పైగా, తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే ఇప్పటివరకు 3 టెస్టులకు నాయకత్వం వహించగా, టీమిండియా మూడు టెస్టుల్లో విజయం సాధించడం గమనార్హం. 
 
నిజానికి తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పెటర్నిటీ సెలవుపై స్వదేశానికి వచ్చాడు. అలాగే, గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా దూరమయ్యాడు. పైగా, తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఎలా ఆడుతుందన్న సందేహాలను పటాపంచలు చేస్తూ భారత జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఈ విజయం వెనుక జట్టు రెగ్యులర్ కెప్టెన్ అజింక్యా రహానే కీలక పాత్ర పోషించాడు. రహానే ఆట, నాయకత్వ సామర్థ్యంపై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చూసేందుకు బక్క పలుచగా కనిపించే రహానేలో పట్టుదల ఎంత మెండుగా ఉంటుందో తొలి ఇన్నింగ్స్‌లో అతను సాధించిన అద్భుతమైన సెంచరీయే చెబుతుంది. 
 
ఎన్ని విమర్శలు వచ్చినా... మౌనంగా తన పని తాను చేసుకుపోయే ఈ ముంబై వాలాలో క్రికెటింగ్ తెలివి ఏ స్థాయిలో ఉంటుందో మెల్బోర్న్‌లో అతడు చేసిన బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ మోహరింపులే చెబుతాయి. కెప్టెన్సీ తనకు అదనపు భారం కాదని, పైగా ఎంతో బాధ్యత అని భావించి జట్టును ముందుండి నడిపించిన రహానేపై ఇప్పుడు ప్రశంసల జడివాన కురుస్తోంది.
 
రహానే సారథ్యంలోని భారత జట్టు మెల్‌బోర్న్ వేదికగా సాధించిన విజయంపై కోహ్లీ స్పందించాడు. ఈ చిరస్మరణీయ విజయానికి కారకుడు రహానే అని కీర్తించాడు. రహానే జట్టును నడిపించిన తీరు ప్రశంసనీయం కొనియాడాడు. 
 
ఇకపోతే, క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ, జట్టుకు రహానే నాయకత్వం వహించిన తీరు ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నాడు. తెలివైన కెప్టెన్సీ అని అభినందించాడు. ఓ నాయకుడిలా రహానే ముందుండి నడిపించాడని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
 
ఈ మ్యాచ్ అనంతరం రహాన్ స్పందిస్తూ, ఈ విజయం సమిష్టి విజయమని, సమష్టి కృషితో లభించిందని తన వినమ్రతను చాటుకున్నాడు. కొత్తకుర్రాడు శుభ్‌మాన్ గిల్ సమయోచితంగా రాణించడం, ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా తన పాత్రకు న్యాయం చేయడం వంటి పలు కారణాలు తమకు గెలుపును అందించాయని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎడమచేతివాటం ఆటగాళ్లను ఔట్ చేయడంలో ముత్తయ్యను అధికమించిన అశ్విన్