Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేతో హరారే మ్యాచ్.. ఎరుపెక్కిన కంటితో ధోనీ ఫోటో.. కూల్ కెప్టెన్‌కు ఏమైంది..?!

భారత్-జింబాబ్వేల మధ్య జరిగిన మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. బుధవారం హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 17వ ఓవర్ వద్ద ధోన

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (13:27 IST)
భారత్-జింబాబ్వేల మధ్య జరిగిన మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. బుధవారం హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 17వ ఓవర్ వద్ద ధోనీకి జింబాబ్వే బౌలర్ డొనాల్డ్ తెరిపానో బౌలింగ్ చేశాడు. ఈ బంతిని భారీ షాట్ చేసే యత్నంలో బంతి బ్యాట్ అంచును తాకుతూ వెళ్ళి వికెట్లకు తగిలింది. 
 
అయితే వికెట్లపై ఉన్న బెయిల్స్‌లో ఒకటి గాల్లోకి ఎగురుకుంటూ వచ్చి ధోనీ కంటికి తాకింది. దీంతో ధోనీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అయినప్పటికీ కొంతసేపటికి నొప్పిని భరించిన ధోనీ.. పెవిలియన్ వైపు నడిచాడు. ఈ క్రమంలో 13 బంతులాడిన ధోనీ 9 పరుగులు సాధించాడు. 
 
తాజాగా కంటికి పెను ప్రమాదం తప్పిందని, కానీ కన్ను ఎరుపెక్కిందని ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎరుపెక్కిన కన్నుతో దిగిన సెల్ఫీ ఒకటి పోస్టు చేశాడు. గాయం వల్ల విజన్‌ కొంత మసకగా ఉందని, నొప్పి కూడా ఉందని ధోనీ చెప్పుకొచ్చాడు. కాగా జింబాబ్వేతో జరిగిన మూడు ట్వంటీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments