Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్

ఠాగూర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (08:41 IST)
పాకిస్థాన్ వన్డే క్రికెట్ జట్టు, టీ20 జట్టు కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్‌ 2024కు సారథ్యం వహించిన బాబర్ ఆజం గత నెలలో కెప్టెన్సీ నుంచి వైదొలగిన విషయం తెల్సిందే. దీంతో కొత్త కెప్టెన్‌గా రిజ్వాన్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు లాహోర్‌లో జరిగిన మీడియా సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. 
 
మహ్మద్ రిజ్వాన్ తన సీనియారిటీ, ఆటగాడిగా అతని విశ్వసనీయత, దేశవాళీ క్రికెట్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో రాణింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రిజ్వాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్టు నఖ్వీ వెల్లడించారు. 
 
కాగా, మూడు వన్డేలు, టీ20 సిరీస్ కోసం పాసిస్థాన్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన‌ కోసం పాక్ జట్టుగా రిజ్వాన్‌ పేరును ఖరారు చేశారు. తన కెప్టెన్సీకి ఈ పర్యటన అగ్నిపరీక్ష వంటిది. రిజ్వాన్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో త్వరలోనే పాక్ గడ్డపై జరుగనున్న చాంపియన్స్ ట్రోపీ మెగా ఈవెంట్ అతనికి అత్యంత కీలకంగా మారనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments