Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

92 యేళ్ళ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో జైస్వాల్ సరికొత్త రికార్డు

Yashasvi Jaiswal

ఠాగూర్

, ఆదివారం, 27 అక్టోబరు 2024 (11:58 IST)
భారత క్రికెటర్ జైస్వాల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు. 92 యేళ్ల భారత టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో ఒకే క్యాలెండర్ యేడాదిలో 30కి పైగా సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. పర్యాటక న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. బెంగుళూరు వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌‍లో భారత్‌ను చిత్తుగా ఓడించిన కివీస్ జట్టు పూణే వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఓడించిది, టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 2012 తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన జట్టుగా కివీస్ నిలిచింది. 
 
కాగా రెండో ఇన్నింగ్స్ 360 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మినహా ఎవరూ 50కి పైగా స్కోర్లు చేయలేకపోయారు. జైస్వాల్ వేగంగా ఆడి కేవలం 65 బంతుల్లోనే 77 పరుగులు బాదాడు. తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో జైస్వాల్ ఒక ప్రత్యేక రికార్డును సాధించాడు.
 
92 యేళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ యేడాదిలో 30కి పైగా సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నిలిచాడు. 2024లో జైస్వాల్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ కొట్టిన మూడు సిక్సర్లతో కలుపుకొని ఈ ఏడాది మొత్తం అతడి సిక్సర్ల సంఖ్య 32కి పెరిగింది. 
 
అతడికి సమీపంలో భారతీయ క్రికెట్లు ఎవరూ లేరు. ఇక అంతర్జాతీయంగా చూస్తే టెస్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ (33 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
 
2024లో టీమిండియా మరో 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్ ఒకటి, బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్లు ఆడనుంది. దీంతో మరో రెండు సిక్సర్లు బాది మెకల్లమ్ రికార్డును యశస్వి జైస్వాల్ సునాయాసంగా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది భారీగా సిక్సర్లు బాదడమే కాదు, 1,000కి పైగా టెస్టు పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11: టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి, 41-37తో దబంగ్‌ ఢిల్లీ కెసి గెలుపు