Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 : ఫైనల్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా ఆర్సీబీ

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (11:23 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2025 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్‌ను ఆర్సీబీ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ 2025 టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
 
చండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు అద్భుత ప్రతిభను కనబరిచారు. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్సీబీ బౌలర్లు ఆది నుంచే పంజాబ్ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులు విసిరారు. ఫలితంగా ఆ జట్టు 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలువలేక పోయింది. ఫలితంగా కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ఆ తర్వాత స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు కేవలం 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ జట్టులో సాల్ట్ 56, విరాట్ కోహ్లీ 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పటీదార్ 15 చొప్పున పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జెమీసన్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. పవర్ ప్లేలో ఆర్సీబీ 61 పరుగులు చేయడం గమనార్హం. 
 
కాగా, ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూన్ మూడో తేదీన జరుగనుంది. రేపు గుజరాత్ టైటాన్స్, ముంబై మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌ జట్టుతో తలపడుతుంది. క్వాలిఫయర్ జట్టు మ్యాచ్ జూన్ 1వ తేదీన జరుగుతుంది. క్వాలిఫయర్-2లో నెగ్గిన జట్టు ఆర్సీబీతో ఆడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

తర్వాతి కథనం
Show comments