Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరా?

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (16:20 IST)
వచ్చే నెలలో పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టడం లేదు. పైపెచ్చు.. భారత్ ఆడే మ్యాచ్‌‍లన్నింటినీ తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. ఇదిలావుంటే, ఈ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్ల కోసం తయారు చేసిన జెర్సీలపై పాకిస్థాన్ పేరుతో లోగోను డిజైన్ చేశారు. ఇది భారత్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వివరణ ఇచ్చింది. 
 
ఫిబ్రవరి 19వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. పాకిస్థాన్ ఆతిథ్య దేశం కాబట్టి... ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు ధరించే జెర్సీలపై టోర్నమెంట్ లోగోతో పాటు పాకిస్థాన్ పేరు కూడా ఉంటుంది. అయితే, తమ జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడాన్ని బీసీసీఐ వ్యతిరేకించింది. టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడాన్ని తాము ఒప్పుకోబోమని స్పష్టం చేసింది.
 
కానీ ఐసీసీ... టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీలు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇది టీమిండియాకు కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఇందుకు ప్రత్యామ్నాయమే లేదని స్పష్టం చేసింది. ఐసీసీ ఈ విషయంలో తన వైఖరి తేల్చిచెప్పడంతో బీసీసీఐ తన నిర్ణయం మార్చుకుంది. 
 
పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీలు ధరించేందుకు తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఐసీసీ నియమనిబంధనలను ఎలా ఉన్నా తాము అనుసరిస్తామని తెలిపారు. ఐసీసీ నిర్ణయాన్ని తప్పక పాటిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్

జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?

ప్రియుడి స్నేహితులతో కలిసి భర్తను చంపేసి.. లవర్‌కు వీడియో కాల్ చేసి డెడ్‌బాడీని చూపిన భార్య!

అమరావతి రాజధాని ప్రారంభోత్సవం: ఐదు లక్షల మంది ప్రజలు.. 4 హెలిప్యాడ్‌లు

అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments