Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి నుంచి పొట్టి క్రికెట్ పోరు : కోల్‌కతా వేదికగా భారత్ - ఇంగ్లండ్ ఢీ

Advertiesment
ind vs eng
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, కోల్‌కతా జట్ల మధ్య తొలి మ్యాచ్ కోల్‍‌కతా వేదికగా బుధవారం జరుగనుంది. అన్ని విభాగాల్లో ఇరు జట్లూ సమతూకంతో ఉండటంతో ప్రారంభ మ్యాచ్ నుంచే ఈ సిరీస్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇంగ్లండ్ తన చివరి టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ జట్టుతో ఆడింది. ఐదు మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను 3-1తో విజయం సాధించింది. భారత క్రికెట్ జట్టు చివరిసారి సౌతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఇందులో భారత్ 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 11సార్లు విజయం సాధించింది. భారత గడ్డపై 11 మ్యాచ్‌లలో ఆడి ఐదింటిలో గెలిచింది. 
 
ఇకపోతే, మడమ నొప్పితో బాధపడుతూ ఏడాది కాలంగా జట్టుకు దూరమైన వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసను కూడా జట్టులో స్థానం లభించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ రెడ్డికి కూడా టీ20 జట్టులో చోటు కల్పించారు. 
 
అదేవిధంగా ఇంగ్లండ్ జట్టులో పేసర్ గస్ అట్కిన్సన్ యేడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. 2023 డిసెంబర్ చివరిసారి అతడు వెస్టిండీస్‌తో ఆడాడు. ఇక, ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఎంపిక చేసింది. లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. ఫిల్సాల్ట్, బెన్ డకెట్ కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. జోస్ బట్లర్ జట్టును నడిపిస్తాడు.
 
ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుండగా 25వ తేదీన చెన్నై, 28వ తేదీ రాజ్‌కోట్, 31వ తేదీన పూణే, ఫిబ్రవరి 2వ తేదీన ముంబైలో మ్యాచ్‌లలో జరగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి వన్డే ఫిబ్రవరి 6వ తేదీన నాగ్‌పూర్‌లో జరగనుండగా, 9వ తేదీన కటక్‌లో రెండో వన్డే, 12న అహ్మదాబాద్‌లో చివరి వన్డే జరుగుతాయి. 
 
భారత జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్య కుమార్, (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్సర్ పటేల్, హర్షదీప్ సింగ్, షమీ, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్, హర్షీత్ రాణా. 
 
ఇంగ్లండ్ జట్టు: ఫిల్సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాక్ బాథెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా అర్చర్, అదిల్ రషద్, మార్క్ వుడ్. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 పోరు : భారత్‌కు అగ్నిపరీక్ష!