Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను పెళ్ళి పేరుతో మోసం చేసిన బాబర్ అజం?

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (16:58 IST)
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ ఓ మహిళ ఆరోపణలు చేసింది. తాను, బాబర్ అజాం కలిసి చదువుకున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని మొదట బాబరే ప్రతిపాదించాడని ఆమె వెల్లడించింది. 2011లో రిజిస్టర్ మ్యారేజి చేసుకునేందుకు తాము ఇంటి నుంచి వెళ్లిపోయామని తెలిపింది. 
 
బాబర్ కెరీర్ తొలినాళ్లలో అతనికి తాను ఆర్థిక సాయం చేశానని, అతని ఎదుగుదల కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని వివరించింది. అయితే, పాక్ జట్టుకు ఎంపికైన తర్వాత బాబర్ అజాం పూర్తిగా మారిపోయాడని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి గర్భవతిని కూడా చేశాడని ఆరోపించింది. గర్భవతిననే విషయం కూడా మరచి తనను కొట్టాడని ఆరోపించింది. తనపై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని వెల్లడించింది.
 
సాజ్ సాదిక్ అనే జ‌ర్న‌లిస్ట్ ఆ మహిళ ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్న వీడియోను ట్వీట‌ర్‌లో షేర్ చేశాడు. బాబ‌ర్ త‌న‌ను కొట్టాడ‌ని కూడా ఆ మ‌హిళ చెబుతోంది. క్రికెట్‌తో సంబంధం లేని రోజుల నుంచీ బాబ‌ర్ నాకు తెలుసు. అత‌ను ఓ పేద కుటుంబం నుంచి వ‌చ్చాడు. మేమిద్ద‌రం ఒకే కాల‌నీలో ఉండేవాళ్లం అని ఆమె చెప్పింది. 
 
2010లోనే అత‌డు త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ని తెలిపింది. తాను కూడా అందుకు అంగీక‌రించాన‌ని, అయితే త‌మ కుటుంబాలు మాత్రం పెళ్లికి అంగీక‌రించ‌లేద‌ని ఆ మ‌హిళ వెల్ల‌డించింది. 2011లో తాము ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయామ‌ని, అప్ప‌టి నుంచీ అక్క‌డ‌క్క‌డా ఇల్లు అద్దెకు తీసుకొని తాము క‌లిసే ఉండేవాళ్ల‌మ‌ని తెలిపింది. 
 
అయితే పెళ్లి చేసుకుందామ‌ని ఎప్పుడు అడిగినా.. ఇప్పుడు ఆ ప‌రిస్థితుల్లో తాను లేన‌ని అత‌డు చెప్పే వాడ‌ని ఆ మ‌హిళ చెబుతోంది. 2016లో తాను గ‌ర్భం దాల్చిన‌ప్ప‌టి నుంచీ బాబర్ పూర్తిగా మారిపోయాడ‌ని ఆమె చెప్పింది. ఈ ఆరోప‌ణ‌ల‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా స్పందించ‌లేదు. బాబ‌ర్ ఆజం ప్ర‌స్తుతం పాక్ టీమ్‌తో క‌లిసి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. పైగా, అన్ని ఫార్మెట్లకు కెప్టెన్‌గా నియమించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments